కార్పొరేట్ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి: డీజీపీ మహేందర్

కార్పొరేట్ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి: డీజీపీ మహేందర్

హైదరాబాద్: సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ అన్నారు. సికింద్రాబాద్ అశోక్ మై హోం చాంబర్స్ లో టీఎంఐ గ్రూప్ ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాకా పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కు రావాలంటే సామాన్య జనం భయపడేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు.

సామాన్య ప్రజలు స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్యం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో టీఎంఐ గ్రూప్ సేవలు అమోఘమని ప్రశంసించారు.