కార్మికులు కాదు.. ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులు

కార్మికులు కాదు.. ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులు

సర్క్యులర్ జారీ చేసిన ఉన్నతాధికారులు

హైదరాబాద్‌‌, వెలుగు : ఆర్టీసీ కార్మికులను ఇక ఉద్యోగులుగా పిలవనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నెల 7వ తేదీన సర్క్యులర్‌‌ జారీ చేశారు. ఈ విషయం సోమవారం బయటకు వచ్చింది. సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఉద్యోగులుగానే పిలవాలని ఈ నెల ఒకటో తేదీన ప్రగతి భవన్‌‌ లో జరిగిన మీటింగ్‌‌లో  సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషనల్‌‌ స్టాఫ్‌‌తోపాటు మెయింటెనెన్స్‌‌ స్టాఫ్‌‌ను కూడా ఉద్యోగులుగానే పిలవాలని, నోటీసు బోర్డుల్లోనూ ఎంప్లాయిగా పెట్టాలని సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు.

TS RTC workers will be called as employees