టెట్ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు

టెట్ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు
  • ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో నిర్వహించే చాన్స్
  • బీఈడీ స్టూడెంట్లకు పేపర్–1కు అవకాశమియ్యాలె 
  • ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వాలిడిటీ కల్పించాలి
  • టెట్ నిర్వహణ, మార్పులకు విద్యాశాఖ ప్రపోజల్ 

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ సమాయత్తం అవుతోంది. పరీక్ష నిర్వహణతో పాటు పలుమార్పులకు అవకాశమివ్వాలని సర్కారుకు తాజాగా ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం అనుమతించిన 45 రోజుల్లోనే టెట్ నిర్వహించేందుకు రెడీగా ఉంది. అయితే ఇప్పటికే టెట్ నిర్వహణకు విద్యాశాఖ అనేక ప్రపోజల్స్ పంపించినా.. సర్కారు  పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేయడంతో.. టెట్ నిర్వహించడం తప్పనిసరైంది. దీంతో అందరి దృష్టి ఈ పరీక్షపై పడింది.

ఎన్సీటీఈ గైడ్​లైన్స్ ప్రకారం టెట్ వాలిడిటీ ఏడేండ్లు. ఏటా రెండుసార్లు పెట్టాలి. అయితే, టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్​టైమ్ వాలిడిటీ అని మార్పులు చేస్తూ కేంద్రం నిరుడు జూన్​లో ప్రకటించింది. ఏటా టెట్ నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు 2015 డిసెంబర్​లో జీవో 36ను రిలీజ్ చేసింది. కానీ అమలు చేయలేదు. తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటికి 2016లో, 2017లో రెండే సార్లు టెట్ నిర్వహించింది. టెట్ క్వాలిఫై అయినవాళ్లు మాత్రమే రాయగలిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ –2017 )ప్రక్రియ కూడా అప్పుడే నిర్వహించారు. అయితే ఆ తర్వాత మళ్లీ టీచర్ల పోస్టులు నింపకపోవడంతో టెట్​నూ సర్కారు నిర్వహించలేదు. 
మార్పులకు 2 ప్రతిపాదనలు 
రాష్ట్ర ప్రభుత్వం గతంలో టెట్ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు చేయాల్సి ఉంది. బీఈడీ పూర్తయిన అభ్యర్థులు టెట్ పేపర్ 1(ఎస్జీటీ పోస్టులకు) కూ అర్హులుగా మార్చాలి. దీంతో పాటు టెట్ వాలిడిటీని ఏడేండ్ల నుంచి లైఫ్​టైమ్ కు సవరించాలి. ఈ 2 మార్పులను సూచిస్తూ ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గురువారం ప్రతిపాదనలు పంపించారు. టెట్ నిర్వహణకూ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. 
ప్రిపరేషన్​కు నెలన్నర టైమ్​
టెట్​నిర్వహణకు సర్కారు ఒకే చెప్పిన ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు రెడీ అయ్యారు. టెట్ తర్వాత టీఆర్టీ పెట్టాల్సి ఉండటంతో ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో టెట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన నెల, నెలన్నర రోజులు ప్రిపరేషన్​కు టైమ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.