టెట్ ఫైనల్ కీ విడుదల ఎప్పుడు ?

టెట్ ఫైనల్ కీ విడుదల ఎప్పుడు ?

‘టెట్’ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 27న ఫలితాలు విడుదల కానున్నాయి. కానీ టెట్ ఫైనల్ కీ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. గత వారం రిలీజ్ డేట్ ప్రకటన ఇచ్చిన అధికారులు ఫైనల్ కీ మాత్రం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12 న టెట్ నిర్వహించి 15 న ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 18వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రాథమిక కీ టెట్ పేపర్ 1లో 5  సమాధానాలు, పేపర్ 2 లోని ఫైనల్ కీ 5 సమాధానాల్లో మార్పులు చేశారా ? లేదా ? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే టెట్ ఫైనల్ కీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 

లైఫ్ టైం వ్యాలిడిటీతో..

టెట్ పరీక్ష జూన్ 12న  33 జిల్లాల్లో 2,683 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. ఇప్పటినుంచి టెట్ క్వాలిఫై అయితే.. లైఫ్ టైం వ్యాలిడిటీ కల్పించారు. దీంతో అత్యధికంగా 3 లక్షల 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం ఈసారి పేపర్ -1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో పోటీ మరింత పెరిగింది.