ఫిబ్రవరి 23 నుంచి ఐసెట్ లెసన్స్ : టీసాట్ సీఈవో వేణు గోపాల్ రెడ్డి

ఫిబ్రవరి 23 నుంచి ఐసెట్ లెసన్స్ : టీసాట్ సీఈవో వేణు గోపాల్ రెడ్డి
  •     టీసాట్ ​సీఈవో వేణుగోపాల్​రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఐసెట్–​2026కు టీసాట్‌‌ డిజి టల్​లెసన్స్​అందిస్తున్నదని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రత్యేక ప్రసారాలుంటాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రెన్స్‌‌కు నిర్వహించే ఐసెట్‌‌కు కోచింగ్​ క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. 

మే 13,14న పరీక్షలు జరుగుతాయని, అనలిటిక్ ఎబిలిటీ, మేథమెటిక్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ తదితర సబ్జెక్టులపై రోజుకు రెండు గంటల చొప్పున ప్రసారాలు ఉంటాయని వివరించారు. విద్యా చానెల్‌‌లో ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు, నిపుణ చానెల్‌‌లో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు డిజిటల్ లెసన్స్ ప్రసారమవుతాయని వెల్లడించారు.