హైదరాబాద్, వెలుగు: ఈసారి బడ్జెట్ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుందని, అయితే క్షేత్రస్థాయిలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపలేదని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ (టీఎస్ఎఫ్సీసీ) పేర్కొంది.
జీఎస్టీ నోటీసులు, రిటర్నులు సమర్పించడంలో ఇబ్బందులు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ జాప్యం వల్ల వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫెడరేషన్ అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాష్ అన్నారు.
చిన్న వ్యాపారులకు రూల్స్ మరింత సులువుగా ఉండాలని కోరారు. విద్యుత్ సుంకాల సబ్సిడీ, ఈ–కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న అన్యాయమైన పోటీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
