ఓయూలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

ఓయూలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
  •     జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరం
  •     ఓయూ జేఏసీ, ఎన్ఎస్​యూఐ నాయకులు

ఓయూ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జ్యాబ్​క్యాలెండర్​విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓయూలో టీఎస్​జేఏసీ, కాంగ్రెస్​, ఎన్ఎస్​యూఐ, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్​రెడ్డి ఫొటోకు వేర్వేరుగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​అధికార ప్రతినిధులు చనగాని దయాకర్, కోటూరి మానవతారాయ్​మాట్లాడుతూ.. నిరుద్యోగులకు జాబ్​క్యాలెండర్​ఒక వరమన్నారు. ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయని తెలిపారు. పదేండ్ల కాలంలో ఒక్క జాబ్​క్యాలెండర్​రిలీజ్​చేయడం చేతకాని బీఆర్ఎస్​నేతలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. 

సీఎం అమెరికా టూర్​ముగిశాక ఓయూలో సభ నిర్వహిస్తామని చెప్పారు. కేటీఆర్​కు ఓయూకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కేటీఆర్ కు  నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఓయూ జేఏసీ, ఎన్ఎస్​యూఐ, కాంగ్రెస్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మేడ శ్రీను, వినయ్, జంపాల రాజేశ్, సంపత్, భూషణ్, వలిగొండ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.