‘వన్ మినిట్ రూల్’ తప్పనిసరి : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

‘వన్ మినిట్ రూల్’ తప్పనిసరి : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
  •     టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

నక్కలగుట్ట, వెలుగు: టీజీఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సిబ్బంది ప్రతి పనికి ముందు తప్పనిసరిగా ‘వన్ మినిట్ రూల్’ పాటించాలని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి సంస్థ పరిధిలోని 18 సర్కిళ్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు ప్రారంభించే ముందు ఒక్క నిమిషం ఆగి అన్ని భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలని సూచించారు. జూన్ 15 నుంచి వచ్చే సంవత్సరానికి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. 

ఈ నెలాఖరులోగా అన్ని 11 కేవీ ఫీడర్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కువ నష్టాలు ఉన్న ఫీడర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ ఫెయిల్యూర్లు తగ్గించేందుకు సరైన ఎర్తింగ్ ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే 33కేవీ, 11కేవీ లైన్ల జీఐఎస్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.