నేడు (జూన్  29) ఓరుగల్లుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

నేడు (జూన్  29) ఓరుగల్లుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లులో సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‍ నబీన్‍ పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్​లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కేడర్‍తో సమావేశమవనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక నబీ మొదటిసారి ఓరుగల్లుకు వస్తున్న క్రమంలో ఆ పార్టీ నేతలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడాన్ని సవాల్‍గా తీసుకున్నారు.

గడిచిన వారం నుంచి వరంగల్‍, హనుమకొండ జిల్లాల నేతలు డివిజన్‍ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నితిన్‍ నబీన్‍ పాల్గొనే 'విజయ సంకల్పన సమ్మేళనాన్ని' విజయవంతం చేసేలా కార్యాచరణ రూపొందించారు. సమావేశం నిర్వహించే హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్​ అండ్‍ సైన్స్​ కాలేజీలోని సభా స్థలాన్ని నేతలు ఆదివారం పరిశీలించారు.