ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొని ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలియో రహిత సమాజం కోసం ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
నేడు, రేపు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తారని అధికారులు చెప్పారు. హనుమకొండ జిల్లాలో తొలిరోజు పోలియో బూత్లు, ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ బృందాల ద్వారా 81,139 మంది చిన్నారులకు వ్యాక్సిన్వేసినట్లు డీఎంహెచ్వో ఎస్.డీ.రామ్కుమార్తెలిపారు. – వెలుగు, నెట్వర్క్
