వెట్టి చాకిరీ చేయించుకుని వేధింపులు 

వెట్టి చాకిరీ చేయించుకుని వేధింపులు 

హనుమకొండ, వెలుగు:  పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వృద్ధ దంపతులను ఓ హోటల్ యాజమాన్యం నెలల తరబడి పని చేయించుకుని జీతం ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన బుర్ర సునంద– సమ్మయ్య దంతులు మూడేండ్ల కింద వరంగల్​ నగరానికి వచ్చారు. ఈ ఏడాది మార్చిలో హనుమకొండలోని విహార గ్రాండ్ రెస్టారెంట్‌‌లో పనికి చేరారు.

అయితే యాజమాన్యం వేధింపులు భరించలేక పని మానేయగా, రావాల్సిన జీతం ఇద్దరికి కలిపి సుమారు రూ.25 వేలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో కుటుంబం గడవని పరిస్థితుల్లో సునంద, సమ్మయ్యతోపాటు రాజారపు లక్ష్మీ, గిన్నారపు శైలజ కు కూడా జీతాలు ఇవ్వకపోవడంతో గత నెల 16న సుబేదారి పోలీసులకు, అనంతరం లేబర్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు.

అధికారులు జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ నెల 22న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌‌పాయ్‌‌కు కూడా వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. తమకు రావాల్సిన వేతనాలు ఇప్పించి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.