గ్రూప్ 3 అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్.. ఆగస్టు 6 నుంచి 21 వరకు చాన్స్

గ్రూప్ 3 అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్.. ఆగస్టు 6 నుంచి 21 వరకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 3 అప్లికేషన్లలో తప్పుల సవరణకు టీఎస్‌‌పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఈ నెల 16 ఉదయం10 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్‌‌ అందుబాటులో ఉంటుందని టీఎస్‌‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఎడిట్ ఆప్షన్ ఒక్కసారే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. 

అభ్యర్థులు తమ బయోడేటాలోని వివరాలు పరిశీలించుకోవాలని సూచించారు. కాగా, 1,363 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌‌‌‌లో ప్రభుత్వం గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వగా, 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ అండ్ ఎనిమల్ హజ్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌లోని పోస్టుల భర్తీకి గత నెల13, 14 తేదీల్లో నిర్వహించిన పరీక్ష ప్రిలిమినరీ కీని టీఎస్‌‌పీఎస్సీ రిలీజ్ చేసింది. దీనిపై ఏమైనా ఆబ్జెక్షన్లు ఉంటే ఈ నెల 17 నుంచి 19 వరకు వెబ్‌‌సైట్ ద్వారా తెలపాలని సూచించింది.