మే నెలలో జరగాల్సిన రెండు పరీక్షలను వాయిదా వేసిన TSPSC

మే నెలలో జరగాల్సిన రెండు పరీక్షలను వాయిదా వేసిన TSPSC

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మే నెలలో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను వాయిదా వేసింది. పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. 

మే  13వ తేదీన జరగాల్సిన పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షలను సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రీ షెడ్యూల్ చేసినట్లు కమిషన్ పేర్కొంది. 

మే  17వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్ల నియామక పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది.