జులై లేదా ఆగస్టులో గ్రూప్ 3 ఎగ్జామ్

జులై లేదా ఆగస్టులో గ్రూప్ 3 ఎగ్జామ్

హైదరాబాద్​, వెలుగు : గ్రూప్ 3 ఎగ్జామ్​ను జులై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో నిర్వహిస్తామని పేర్కొంది. వివిధ విభాగాల్లో 1,363 పోస్టులకు మంగ ళవారం రాత్రి 9 గంటల నుంచి అప్లి కేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. వచ్చే నెల 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. 105 కేటగిరీలుగా (పోస్ట్ కోడ్స్) ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్​ ఆడిటర్, జూనియర్ ఆడిటర్, సీనియర్ అకౌం టెంట్, జూనియర్ అకౌంటెంట్, అకౌం టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో జూనియర్ అసిస్టెం ట్ పోస్టులే 655 ఉన్నాయి.