
ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీసీ ఆస్తుల అమ్మకం గానీ, డిపోల మూసివేత గానీ చేయడం లేదని ఆయన చెప్పారు. అలాగే ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చే విషయంపైనా ఆయన స్పందించారు. వీఆర్ఎస్ ద్వారా ఎవరినీ ఇప్పుడే తొలగించే ఆలోచన లేదని అన్నారు. ఉద్యోగుల్లో కొందరు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని, అలాంటి వారందరి నుంచి ప్రస్తుతం అభిప్రాయ సేకరణ మాత్రమే చేస్తున్నామని అన్నారు. అలాగే వెల్ఫేర్ బోర్డ్స్ పనిచేస్తున్నందున యూనియన్ల నేతలెవరూ టెన్షన్ పడాల్సిన పనిలేదన్నారు. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్న సందర్భంగా V6 న్యూస్ ఆయనతో మాట్లాడింది.