పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా పీయూష్ గోయల్ మాటలున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్థాయిలో ఆయన మాటలు లేవని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణభవన్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి ప్రెస్‎మీట్ నిర్వహించారు.

‘తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అన్న బీజేపీకి బుద్ధి చెప్పాలి. రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే ఏ ఒక్క పథకానికి కేంద్రం సహకారం ఇవ్వడం లేదు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్‎కు సవాల్ చేస్తున్నా. బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో.. టీఆర్ఎస్ చేసింది ఏంటో బహిరంగ చర్చ జరుపుదాం. పీయూష్‎కు దమ్ముంటే హైదరాబాద్ వచ్చి మాతో చర్చ జరపాలి. తెలంగాణ బీజేపీ నేతలు చిల్లరగాళ్ళు. కేసీఆర్ కొనకున్నా.. మేం వడ్లు కొంటాం అని బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పారు కదా. మొన్న మేమే కొంటామన్న బండి సంజయ్.. ఇవ్వాళ కేసీఆరే కొనాలి అని మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు ఇజ్జత్ లేకుండా బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొట్టి వడ్లు వేయించారు... ఇప్పుడేమో కొనము అంటున్నారు. వడ్లు కొనే వరకు బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి తెలంగాణ‏కు రావొద్దు’ అని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.

For More News..

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2

రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే