ఇకపై మదర్సాల్లోనూ జాతీయ గీతం పాడినంకే క్లాసులు

ఇకపై మదర్సాల్లోనూ జాతీయ గీతం పాడినంకే క్లాసులు

ఉత్తరప్రదేశ్‌లోని మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై మదర్సాల్లోనూ క్లాసులు ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ఆలాపించడం తప్పనిసరి చేసింది. ఉదయాన్నే విద్యార్థులు ప్రార్థనలతో పాటు జాతీయ గీతాన్ని పాడిన తర్వాతే క్లాసులు మొదలుపెట్టాలని యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయించింది. 2017లో తొలిసారిగా యూపీలోని మదర్సాల్లో స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగురవేయడం, జాతీయ గీతాన్ని పాడడం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు రోజు వారీ క్లాసులకు ముందు కూడా జాతీయ గీతాన్ని ఆలాపించేలా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇకపై మదర్సాల్లో టీచర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ బోర్డు చైర్మన్ ఇఫ్తికర్ అహ్మద్ జావెద్ నేతృత్వంలో గురువారం జరిగిన  సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మదర్సాల్లో టీచర్ల రిక్రూట్‌మెంట్ విషయంలోనూ మార్పులు చేయాలని బోర్డు అభిప్రాయపడింది. సాధారణ స్కూళ్లకు టెట్ ఉన్నట్లే మదర్సా టీచర్లకూ MTET అర్హత పరీక్ష నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. అలాగే అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్నీ అందుబాటులోకి తేవాలని తీర్మానించారు.

జాతీయ గీతాలాపన ద్వారా మదర్సాల్లో చదివే పిల్లల్లోనూ దేశ భక్తి పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ ఇఫ్తికర్ అన్నారు. జాతీయ గీతాన్ని రోజూ పాడడం ద్వారా మన దేశ చరిత్ర, సంస్కృతి తెలుస్తాయని, రిలిజియస్ స్టడీస్‌తో పాటు ఇది కూడా అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికే పలు మదర్సాల్లో క్లాసులు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని పాడుతున్నారని, అయితే ఇకపై అన్ని మదర్సాల్లో తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాబోయే అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని ఇఫ్తికర్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బీర్భూమ్ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు