హైదరాబాద్ సిటీ, వెలుగు : శంషాబాద్ ఎయిర్ పోర్డుకి రాకపోకలు సాగించే టీజీఎస్‌ఆర్టీసీ పుష్పక్ ఏసీ బస్సుల ఛార్జీలను ఆర్డీసీ 40 శాతం వరకు తగ్గించింది. ఈ ఛార్జీలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో రూ.350గా ఉండగా, ఇప్పుడు రూ.250 చేసింది. అలాగే, జేఎన్‌టీయూ నుంచి రూ.350 ఉంటే రూ.200, శిల్పారామం నుంచి రూ.300 ఉంటే రూ.200, గచ్చిబౌలి నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. లింగంపల్లి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఇదివరకు రూ.300 ఉండగా రూ.200కు, ఆల్విన్ ఎక్స్‌రోడ్ నుంచి రూ.350 ఉంటే రూ.200కు, కొండాపూర్ నుంచి రూ.300 ఉంటే రూ.200కు, కొత్తగూడ నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. గచ్చిబౌలి నుంచి రూ.300 ఉండగా, రూ.150 చేశారు.
జేబీఎస్నుంచి ఎయిర్‌పోర్ట్‌కు..
జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.350 ఉంటే రూ.200 చేశారు. విమానాశ్రయం నుంచి జేబీఎస్‌కు రూ.400 ఉంటే రూ.300కు తగ్గించారు. మందమల్లమ్మ నుంచి జేబీఎస్, జేబీఎస్ నుంచి మెహిదీపట్నం, జేబీఎస్ నుంచి ఆరాంఘర్వరకు చార్జీని .100గా నిర్ణయించారు.
