సీఎం చెప్పేది అబద్దం.. మాకు అంత జీతం లేదు : ఆర్టీసీ కార్మికులు

సీఎం చెప్పేది అబద్దం.. మాకు అంత జీతం లేదు : ఆర్టీసీ కార్మికులు

కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నాం

జాబ్ తీసేయడానికి సీఎంకు ఏం రైట్ ఉంది

ఖమ్మం : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేడు మూడో రోజుకి చేరింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మంలో సమ్మె చేస్తున్న మహిళా కార్మికులు మాట్లాడారు. జీతభత్యాల కోసం కాదు.. సంస్థను కాపాడుకునేందుకే సమ్మెకు దిగామని తెలిపారు. సీఎం సానుకూలంగా మాట్లాడకపోగా..ఇంకా కఠినంగా మాట్లాడుతున్నారని..ఉద్యోగాలు ఊడుతాయ్ అనేది ముఖ్యమంత్రి భ్రమ అని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల జీతాలు రూ. 50 వేలు అని చెప్పడం అబద్దమని.. కావాలంటే మా పేస్లిప్పులు చూపిస్తామని చెప్పారు.

దసరాకు అందరు పండుగ చేసుకుంటుంటే.. ఇంకా మాకు జీతాలు ఇవ్వకపోగా.. ఉద్యోగాలు ఊడినయ్ అంటూ ప్రకటనచేయడం అన్యాయం అన్నారు. మేము కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నామని.. ఒక్కసారి జాబ్ తీసేయడానికి సీఎంకు ఏం రైట్ ఉందని సీరియస్ అయ్యారు. ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నెరవేరనీయమని..ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు RTC కార్మికులు.