
టీఎస్ ఎస్పీడీసీఎల్ హైదరాబాద్, వెలుగు: కరెంటు బిల్లులపై సందేహాలను సోషల్ మీడియా ద్వారా పరిష్కరిస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి గురువారం చెప్పారు. ఇప్పటికే బిల్లులపై సందేహా లను నివృత్తి చేసేందుకు సంస్థ పరిధిలోని అన్నిఈఆర్‌వోల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-మెయిల్, ట్వి ట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అందే ఫిర్యాదులను రెండు పనిదినాల్లో పరిష్కరించి బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా కస్టమర్లకు జవాబు పంపాలని అధికారులను ఆదేశించినట్లుచెప్పారు. వినియోగదారులు తమ సందేహాలను customerservice@tssouthernpower. com, TsspdclCorporat@twitter, gmcsc. tsspdcl @facebook.com ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు