భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం : జూన్ లోనే రూ.100కోట్లు

V6 Velugu Posted on Jul 05, 2019

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. సమ్మర్ హాలిడేస్ తో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి డబ్బులు, కానుకలు సమర్పించుకున్నారు. ఎన్నడూలూని విధంగా ఈ  జూన్ నెల‌లో 24.66 ల‌క్ష‌ల మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారని తెలిపారు ఆలయ అధికారులు. ఒక్క నెలలోనే శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటిందని చెప్పారు.   ఇందులో భాగంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, హుండీ ఆదాయం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గ‌దుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

దర్శనం : గతేడాది జూన్‌లో 24.1 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ..ఈ ఏడాది జూన్‌ లో 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూన్‌ లో రూ.91.81 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌ లో రూ.100.37 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :గతేడాది జూన్‌ లో 64.05 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూన్‌ లో 71.02 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు : 2018 జూన్‌లో 95.58 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూన్‌లో 1.13 కోట్ల‌ లడ్డూలను అందించారు.

తలనీలాలు :  గతేడాది జూన్‌లో 11.9 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ  జూన్‌లో 12.88 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

గ‌దులు :  గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది జూన్‌లో 106 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది జూన్‌ లో 107 శాతం న‌మోదైంది.

Tagged tirumala, TTD, hundi

Latest Videos

Subscribe Now

More News