టీటీడీ నూతన బోర్డు ప్రకటన: చైర్మన్‎గా బీఆర్‌.నాయుడు

టీటీడీ నూతన బోర్డు ప్రకటన: చైర్మన్‎గా బీఆర్‌.నాయుడు

 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 24 మందితో టీటీడీ కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా బీఆర్‌.నాయుడు నియామకం అయ్యారు. ఈ మేరకు 2024, అక్టోబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డులో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన ఐదుగురికి, కర్ణాటకకు చెందిన ముగ్గురికి టీటీడీ బోర్డులో చోటు  స్థానం దక్కింది. 

 గత వైసీపీ ప్రభుత్వం 24 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో 24 మంది టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో టీటీడీ బోర్డు రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీటీడీ బోర్డు కొత్త పాలక వర్గాన్ని ఎంపిక చేసింది. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దమారం రేపడంతో టీటీడీ బోర్డు కొత్త పాలకవర్గం ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. టీటీడీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొనగా.. ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెన్స్‎కు తెరదించింది. 

టీటీడీ బోర్డు సభ్యులు:

ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌,  జంగా కృష్ణమూర్తి, ఆర్‌.ఎన్‌.దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్‌,  పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి,
నరేశ్‌ కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, సౌరభ్‌ హెచ్‌.బోరా