టక్కర్ టీజర్ టాక్

టక్కర్ టీజర్ టాక్

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. రొమాన్స్, యాక్షన్‌‌తో సాగిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.  అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల కథాంశంతో తెరకెక్కుతోంది. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.  మే 26న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.