అవార్డులు ఇచ్చేయండి సార్: వరదల్లో ఇరగదీస్తున్న రిపోర్టర్లు

అవార్డులు ఇచ్చేయండి సార్: వరదల్లో ఇరగదీస్తున్న రిపోర్టర్లు

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా వరద ముప్పు మాత్రం ఆయా రాష్ట్రాలను భయపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల తాకిడికి వంద మందికి పైగా మృతి చెందగా, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు.

వరదల తాకిడి ఇలా ఉంటే.. ఈ ఉదృతిని చూపెట్టేందుకు మీడియా మిత్రులుపడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వర్షపు నీరు ఏ స్థాయిలో నిల్వ ఉందో చెప్పడానికి.. అందులో మునిగి చూపిస్తున్నారు. తాజాగా, ఓ జాతీయ ఛానల్ రిపోర్టర్ అలాంటి ప్రయత్నమే చేశారు. మెడలోతు నీటిలో నిలబడి, రాజధాని నగరంలోని రహదారి పరిస్థితులను చూపించారు. రిపోర్టర్ వరదల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి తన వెనుక సబ్బుతో కడుక్కోవటం మనం వీడియోలో చూడవచ్చు.

రిపోర్టర్ చేసిన ఈ సాహసానికి.. అవార్డు ప్రకటించాలని నెటిజెన్స్ కోరుతున్నారు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'ను స్థాపించిన ప్రముఖ ప్రచురణకర్త 'రామ్‌నాథ్ గోయెంకా' పేరు సూచించేలా 'బద్‌నాథ్ గోయెంకా' అవార్డుతో సత్కారించాలని కామెంట్స్ చేస్తున్నారు.