తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ తోపాటు 9మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ ప్రమాణం చేయించారు. మంత్రులలో టీవీకే పార్టీ సీనియర్ నేతలు ఆధవ్ అర్జునా,కె.ఎ. సెంగోట్టయన్ లు ఉన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..
తిరు ఎన్. ఆనంద్
తిరు ఆధవ్ అర్జునా
డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్
తిరు కె.ఎ. సెంగోట్టయన్
తిరు పి. వెంకటరమణన్
తిరు ఆర్. నిర్మల్‌కుమార్
తిరు రాజ్మోహన్
డాక్టర్ TK. ప్రభు
సెల్వి S.కీర్తన ఉన్నారు.
1967 తర్వాత, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలలో (డీఎంకే లేదా ఏఐఏడీఎంకే) దేనికీ చెందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విజయ్ చరిత్ర సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌లతో పాటు త్రిషా కృష్ణన్ సహా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ అనేక ట్విస్టుల తర్వాత అధికారం పీఠం దక్కించుకుంది. కాంగ్రెస్, సీపీఐఎం, సీపీఐ,వీసీకే, ఐయూఎంఎల్ సపోర్ట్ తో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బలనిరూపణకు మూడు రోజుల గడువు ఇచ్చారు గవర్నర్.
