అనూహ్య ఫలితాలతో.. సంబరాలు రద్దు చేసుకున్న డీఎంకే.. ఆఫీసు ముందు టెంట్లు తొలగింపు

అనూహ్య ఫలితాలతో.. సంబరాలు రద్దు చేసుకున్న డీఎంకే.. ఆఫీసు ముందు టెంట్లు తొలగింపు

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. పార్టీ స్థాపించిన  రెండేళ్ళలో తమిళ వెట్రికజం(టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఊహించని పరిణామాలతో డీఎం కే వర్గాలు షాక్ తిన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపు డీఏంకే నే తిరిగి అధికారంలోకి వస్తుందని  అంచనా వేసినప్పటికీ అవి తారుమారు కావడంతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. పార్టీ గెలుస్తుందని  సంబరాల జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న డీఏంకే వర్గాలు.. నిరాశపర్చే ఫలితాలతో వెనక్కితగ్గాయి. సంబరాలను రద్దు చేసుకుంది. డీఎంకే కార్యాలయంలో టెంట్లను తొలగించారు