V6 News

మార్కుల్లోనూ కవలలే!

మార్కుల్లోనూ కవలలే!

సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కవలలు. పేర్లు పసునూరి శ్రుతి, పసునూరి శ్రుహిత. వీరిద్దరికీ టెన్త్​ మార్కులు కూడా సమానంగా వచ్చాయి.

అక్క శ్రుతికి 512, చెల్లెలు శ్రుహితకు 511 మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ‘మేమిద్దరం హన్మాజీపేట హైస్కూల్​లో చదివాం. కంబైన్డ్​ స్టడీ చేశాం. ఇద్దరికీ సేమ్​ మార్కులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు” అని అక్కాచెల్లెళ్లు చెప్పారు. -హైదరాబాద్, వెలుగు