ప‌న్నీరు బిర్యానీలో చికెన్ ముక్క‌లు.. అది కూడా ఆ పుణ్య‌క్షేత్రంలో..

ప‌న్నీరు బిర్యానీలో చికెన్ ముక్క‌లు.. అది కూడా ఆ పుణ్య‌క్షేత్రంలో..

దేశంలో అత్యంత ఇష్టపడే  పాట్ రైస్ డిష్‌లలో బిర్యానీ ఒకటి. సుగంధ ద్రవ్యాలు, మాంసం, అన్నంల రుచికరమైన కలయికను ఆహార ప్రియులు ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటారు. వీటిల్లో చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. అయితే ఇటీవల, ఒక ట్విట్టర్ యూజర్.. తన స్నేహితుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీపై రాసుకువచ్చాడు. అతడు దాని వల్ల ఎదుర్కొన్న అసౌకర్యాన్ని పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ ట్వీట్ ప్రకారం, తన స్నేహితుడు పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు, కానీ దానికి బదులుగా, అతను చికెన్ ముక్కలతో కూడిన ఫుడ్ ను అందుకున్నాడని తెలియజేశాడు.

 

అశ్వినీ శ్రీవాస్తవ అనే ట్విట్టర్ యూజర్ జూలై 9న రాత్రి వారణాసిలో తన స్నేహితుడు అనుభవించిన కష్టాలను పంచుకున్నారు. అతను ఫుడ్ అగ్రిగేటర్ అప్లికేషన్ Zomato ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడని, వెజిటబుల్ పనీర్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇన్‌వాయిస్‌ను చూపించే రెండు వీడియోలను కూడా పంచుకున్నాడు. వీటిలో బిర్యానీ బాక్స్ లో తమకు వచ్చిన చికెన్ ముక్కలను కూడా క్లిప్ లో చూపించాడు.

“మొదట్లో పనీర్ బిర్యానీ పనీర్‌ను కవర్‌లో చుట్టి ఉంచడం వల్ల ఇది నిజంగా చికెన్ బిర్యానీ అనుకుని అంతగా గమనించలేదు. ఆ తర్వాత వారు దాని రుచి చూసినప్పుడే ఏదో తేడాగా ఉందని గ్రహించారు. " అని యూజర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆ తర్వాత వారు బెహ్రూజ్ బిర్యానీకి కాల్ చేసినప్పుడు, వారిని జొమాటోను సంప్రదించమని చెప్పారు.  వారు జొమాటోకు కాల్ చేసినప్పుడు, హోటల్‌తో మాట్లాడమని చెప్పారు" అని అతను ఫిర్యాదును కూడా తెలియజేశాడు. ఈ ట్వీట్ షేర్ కావడంతో ఇప్పటివరకు దీనికి 8లక్షలకు పైగా వ్యూస్. 5వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Hi Ashwini, apologies for the mishap. We never intended to do that. We will get this checked immediately.

— zomato care (@zomatocare) July 8, 2023

ఇంతలో, జొమాటో, బెహ్రూజ్ బిర్యానీ రెండూ ఫిర్యాదుపై స్పందించాయి. వైరల్ ట్వీట్‌కు వెంటనే రిప్లైగా.. "హాయ్ అశ్వినీ.. జరిగిన ఘటనకు క్షమాపణలు. మేము అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మేము దీన్ని వెంటనే చెక్ చేస్తాం" అని జొమాటో తెలిపింది. ఇక ఇదే తరహాలో బెహ్రూజ్ బిర్యానీ కూడా రిప్లై ఇచ్చింది. "హాయ్, అశ్వినీ! ఇది ఖచ్చితంగా మేము ఉద్దేశించి చేసింది కాదు. మీ అనుభవానికి ఆటంకం కలిగింది కాబట్టి మేము క్షమాపణలు కోరుతున్నాము. దయచేసి మీ కాంటాక్ట్ నంబర్‌ను మాకు DM చేయండి, దీన్ని పరిష్కరిస్తాం" అని బెహ్రూజ్ బిర్యానీ ట్విట్టర్‌లో తెలిపింది.

Hi Ashwini! That is certainly not the experience we intend for our customers, and we apologize as your experience has been hampered. Kindly DM us your contact number so that we can fix this for you. (AZ)

— Behrouz Biryani (@BehrouzBiryani) July 8, 2023