
ట్విట్టర్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు టిప్‌గా ఇక నుంచి బిట్‌కాయిన్ టోకెన్లు కూడా ఇవ్వొచ్చు. ఎక్కువమంది యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టింది ట్విట్టర్. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లాగ జనాన్ని ఆకర్షించేందుకు ఈ ఆప్షన్ తీసుకొచ్చింది ట్విట్టర్. “ తమ ఫ్యాన్స్‌తో కాన్వర్జేషన్స్ పెట్టేందుకు ట్విట్టర్ ఒక మంచి ఫ్లాట్‌ఫాం కావాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ తీసుకొచ్చాం. చాలామంది డిజిటల్ కరెన్సీ వాడుతున్నారు, వాళ్లను అట్రాక్ట్ చేసేందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది” అని చెప్పారు ప్రొడక్ట్ లీడ్ ఈస్టర్ క్రాఫార్డ్.