
శ్రీనగర్‌లో సోమవారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్ బోర్డర్ లోని ఖాన్మో ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇద్దరు ఉగ్రవాద సంస్థ ఆల్-బదర్ టెర్రరిస్టులని కశ్మీర్ పోలీసులు తెలిపారు. మొదట ఒకరే చనిపోయాడని అనుకున్నప్పటికీ.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు చెప్పారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో భారీగా కాల్పులు జరిగాయన్నారు.