రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram charan) హీరోగా వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంక‌ర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బ‌డ్జెట్‌ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.  

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ సినిమా నుండి ఒక సాంగ్ లీకైన విషయం తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు  కూడా చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంగ్ లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎవరు.. సాంగ్ ఎలా లీక్ చేశారు అనే వివరాలు బయటకు రాలేదు. ఇక అదే సాంగ్ ను దీపావ‌ళి సంద‌ర్బంగా అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.