షాద్ నగర్, వెలుగు: రూ. 10 లక్షలిస్తే పూజలు చేసి రూ. 30 లక్షల పైసల వర్షం కురిపిస్తామని నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఇద్దరిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన మక్బూల్ బాషాను సిటీకి చెందిన కోటేశ్వరరావు, వేణు, రామ్మోహన్కలిసి షాద్‌నగర్‌లోని ఓ విల్లాకు రప్పించారు.
అక్కడ బాధితుడు తన వద్ద ఉన్న రూ. 9 లక్షలను చూపించగానే, మాస్క్ ధరించిన నలుగురు వచ్చి చంపుతామని బెదిరించి డబ్బులతో పరారయ్యారు. ఈ కేసులో కావలి బ్రహ్మయ్య, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 6 లక్షల నగదు, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
