
హైదరాబాద్: ఖైరతాబాద్లో యువకుడి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జులై 27న ఖైరతాబాద్లోని గజ్జలమ్మ ఆలయం దగ్గర కట్టిన బ్యానర్ విషయంలో ముఖేష్, సునీల్ మధ్య జరిగిన గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. సునీల్ తన బ్యాచ్ను వెంటేసుకుని వచ్చి వికేష్, ఫతుతో పాటు కొంతమంది స్థానిక యువకులతో కలిసి ముఖేష్పై భౌతిక దాడి చేసి బెదిరింపులకు దిగారు.
ఈ ఘటనతో బస్తీలో తీవ్ర అవమానం జరిగిందని భావించిన ముఖేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తనలో తాను కుమిలిపోయాడు. స్థానికంగా పరువు పోయిందని మానసిక క్షోభకు గురై జులై 27న చనిపోవాలని క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర మానసిక వేదనతో జులై 27న రాత్రి ముఖేష్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ముఖేష్పై దాడి చేసిన ప్రధాన నిందితుడు వికేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
►ALSO READ | తమ్ముడికి హెచ్ఐవీ ఉందని బయటపెట్టిన యాక్సిడెంట్.. అంబులెన్స్లోనే చంపేసిన అక్కాబావ..!
వికేష్ను సంగారెడ్డి సమీపంలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు వెతుకులాట సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ముఖేష్ అంత్యక్రియలు జరిగాయి. స్థానికులు ముఖేష్ మృతి పట్ల క్యాండిల్ ర్యాలీ చేశారు. బుధవారం ఖైరతాబాద్ ప్రాంతం వరకూ బంద్కు స్థానికులు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్లో బుధవారం స్వచ్ఛందంగా షాపులు మూసేయాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. యువకుడి ఆత్మహత్యతో ఖైరతాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది.