V6 News

సీఎంపై పోస్టర్ల కేసు నిందితులు అరెస్ట్

సీఎంపై పోస్టర్ల కేసు నిందితులు అరెస్ట్
  • బీజేపీ కార్యకర్తలుగా అనుమానం
  • పార్టీ ఆఫీసు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి విచారణ

బషీర్​బాగ్, వెలుగు : గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ వెలసిన పోస్టర్ల కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. రెండు రోజుల కింద ‘రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన రిపోర్ట్ కార్డు..ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీభవన్​పరిసరాల్లో పోస్టర్లు అంటించారు. వారణాసి సినిమాలో విలన్​క్యారెక్టర్ కూర్చున్న కుర్చీలో రేవంత్​రెడ్డి కూర్చున్నట్టు పోస్టర్​డిజైన్​చేసి అందులో పలు వివాదాస్పద కామెంట్స్​చేశారు. 

దీనిపై అబిడ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అజయ్ కుమార్, సుమిరన్ ను అరెస్ట్ చేశారు. వారిపై బీఎన్ఎస్ యాక్ట్ 352, 353 (1) (c), 353 (2) కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. దాన్ని ధృవపర్చుకునేందుకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, సీఐ ఇమాన్యుల్ వెళ్లారు. బీజేపీ కార్యాలయ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ ఉమామహేశ్వరరావును విచారించారు. కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే ఇవ్వాలని కోరారు.