హైదరాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో రెండు ఆటోలు దగ్దమయ్యాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర ఉన్న హెచ్ పీ పెట్రోల్ బంకులో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...పెట్రోల్ బంకులో ఓ ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కన ఉన్న మరో ఆటోకు మంటలు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో రెండు ఆటోలు దగ్దమవ్వగా... పెట్రోల్ బంకు సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
