- మేడ్చల్ జిల్లా డబిల్పూర్ లో ఘటన
- గ్రామంలో విషాదఛాయలు
మేడ్చల్, వెలుగు: చెరువులో తోటి స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా డబిల్పూర్ గ్రామంలో జరిగింది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్ గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని చెరువులో ఆరుగురు స్నేహితులు కలిసి స్నానం చేసేందుకు వెళ్లారు. ఉమన్ (14), ఇర్ఫాన్(12) చెరువులోకి దిగి స్నానం చేస్తూ లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో నీటి మునిగి గల్లంతయ్యారు.
తోటి స్నేహితులు స్థానికులను పిలవడంతో వారు వెంటనే వచ్చి ఇద్దరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మునీరాబాద్కు చెందిన ఉమన్ మేడ్చల్ లోని నాగార్జున హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇర్ఫాన్ డబిల్పూర్లోని ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

