ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపు తప్పిన బస్సు వారి పాలిట శాపమైంది. చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తున్న ఫ్యామిలీని విషాదంలో ముంచింది. అప్పటివరకు చిన్నారి నవ్వులతో సంతోషంగా గడిపిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారాయి. తమిళనాడులోని సేలం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకేకుటుంబానికి చెందిన ఏడుగురు స్పాట్ లోనే చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (మార్చి20) ని సేలం సమీపంలో తమిళనాడు ఆర్టీసికి చెందిన బస్సు అదుపుతప్పిన ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారి పుట్టువెంట్రుకలు తీయించేందుకు గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ రహదారిపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
అరియనూర్ సమీపంలో సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (టీఎన్ఎస్టీసీ) బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటూవీలర్, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్ పై వెళ్తున్న తల్లీకొడుకు ఇరుసై, మణికందన్ అక్కడికక్కడే మృతిచెందారు. టెంపోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన సెల్వరాజ్ , అమృత, మురుగన్, జీవిక(11 నెలలు) నితీష(5) స్పాట్ లోనే మృతిచెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
