
ములుగు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఏటూరునాగారం, పస్రాకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. వీళ్లద్దరూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చారనే సమాచారంతో… ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. తర్వాత వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు . వీరి కుటుంబ సభ్యులతో సహా 26 మందిని క్వారంటైన్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.