V6 News

భార్య టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. భార్యను చంపేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి భర్త ఆత్మహత్య !

భార్య టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. భార్యను చంపేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి భర్త ఆత్మహత్య !

జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఘణపురం మండలం సీతారాంపురం గ్రామంలో రామాచారి అనే వ్యక్తి తన భార్య సంధ్య(42) కు ఉరి వేసి చంపేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత తాను కూడా ఉరి వేసుకుని చచ్చిపోయాడు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రామాచారి రెండో వివాహం చేసుకున్నాడు. భార్య టార్చర్ తట్టుకోలేకపోతున్న అంటూ  వీడియో విడుదల చేసిన రామాచారి ఆమెను చంపేసి తానూ చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

2025 జనవరిలో కూడా ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ పట్టణంలోని నాగమాల్ బీసీ కాలనీకి చెందిన సాయి(21)తో హైదరాబాద్ కు చెందిన నందినితో వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజుల నుంచే భర్తతో సన్నిహితంగా ఉండకుండా.. నందిని వేధించింది. భార్య వేధింపులు తట్టుకోలేక ఆమె ఇంటిలో లేని సమయం చూసుకుని ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడు. సాయి బావ శేఖర్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.