పొలం తగాదా.. మాజీ సైనికుడి కాల్పుల్లో ఇద్దరి మృతి

పొలం తగాదా.. మాజీ సైనికుడి కాల్పుల్లో ఇద్దరి మృతి

గుంటూరు: జిల్లాలోని మాచర్ల మండలం రాయమవరం గ్రామంలో పొలం తగాదా ఘర్షణకు దారితీసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘర్షణలో ఆవేశానికి లోనైన మాజీ సైనికుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు దిగాడు. 8 రౌండ్లు కాల్పులు జరపగా... ఇద్దరు చనిపోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కలకలం రేపింది. 
మాజీ సైనికుడు సాంబశివరావుకు తన దయాదులతో పొలం విషయంలో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో విషయంలో మాట్లాడుకుంటుండగా మాటామాటా పెరిగింది. చివరకు ఘర్షణకు దారితీయడంతో కోపోద్రికుడైన మాజీ సైనికుడు సాంబశివరావు న వద్ద తుపాకీ ఉందని బెదిరించి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో మట్టా శివ, బాలకృష్ణ, ఆంజనేయులు అనే ముగ్గురికి బుల్లెట్లు దిగాయి. గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరేలోపే శివ, బాలకృష్ణ ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.