
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను ప్రవేశపెట్టింది. ఆ మిషన్ లో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన విమానం విశాఖకు చేరింది. లాక్డౌన్ వల్ల అబుదాబిలో చిక్కుకున్న 148 మంది భారతీయులు బుధవారం విశాఖపట్టణంలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విమానంలో వచ్చిన వారిలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు.. 13 జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు ఉన్నారు. వారందరికీ ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు, ఇమిగ్రేషన్, ఇతర పరీక్షలు చేసి సొంత జిల్లాలకు పంపించడానికి 13 బస్సులు సిద్దంగా ఉంచారు.
అదేవిధంగా లండన్ నుంచి బయలుదేరిన విమానం కూడా విజయవాడ చేరుకుంది. లండన్ లో చిక్కుకున్న 156 మంది ఎన్‌ఆర్ఐ ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం విజయవాడకు చేరుకుంది. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎన్‌ఆర్‌ఐలను అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ కు వెళ్లవల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. ప్రయాణికులు ప్రభుత్వ లేదా వారికి నచ్చిన పెయిడ్ క్వారంటైన్ కు వెళ్లవచ్చు. విమానంలో వచ్చే ప్రతీ ప్రయాణికుడి పూర్తి వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు.
For More News..