ట్రక్కుపై రాళ్లు పడి ఇద్దరు మృతి

ట్రక్కుపై రాళ్లు పడి ఇద్దరు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా వాహనాలపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం మండిలోని హనోగి ఆలయం సమీపంలో మూడు వాహనాలపై బండరాళ్లు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కూరగాయలు మరియు నిత్యావసర సరుకులను సరఫరా చేయడానికి ఈ వాహనాలు కుల్లు వెళ్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనపై మండి పోలీసు ఎస్పీ గురుదేవ్ చంద్ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ రోజు తెల్లవారుజామున మండి జిల్లాలోని హనోగి ఆలయ సమీపంలో ఎన్‌హెచ్ 3లో ట్రక్కుతో సహా మూడు వాహనాలపై కొండచరియలు పటడం వల్ల ఇద్దరు మృతి చెందారు, మరో ముగ్గురు గాయపడ్డారు. కుల్లుకు వెళ్లే ఈ వాహనాలు అవసరమైన వస్తువులు, కూరగాయలు సరఫరా చేయాల్సి ఉంది’అని ఆయన తెలిపారు. కుల్లు జిల్లాలో రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాగల్ నాలా వద్ద సైనజ్-లార్జీ హైవేని మూసివేశారు. ఈ హైవే జిల్లాలోని 15 గ్రామ పంచాయతీలను కలుపుతుంది.

For More News..

కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్

రాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు