నర్సాపూర్(జి), వెలుగు : ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిర్మల్‌జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ (జి) మండలానికి చెందిన రిజ్వాన్ (20), అబ్దుల్ హర్షద్ (22) శుక్రవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సమీపంలోని శుద్ధ వాగుకు వెళ్లారు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని నీటిలో గాలించగా.. ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
