
కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రెండు నెలల గర్భిణీ మృతి చెందింది. ప్రెగ్నెంట్ స్వరూప మృతికి డాక్టర్ల నిర్లక్షమే కారణమని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలు స్వరూపది మానకొండూరు మండలం అన్నారం గ్రామం. ఆమెకు కడుపు నొప్పి రావడంతో స్వరూపను ఆస్పత్రికి తీసుకొచ్చామన్నారు కుటుంబ సభ్యులు. ఆరు గంటల చికిత్స తర్వాత స్వరూపను డిశ్చార్జ్ చేశారని.. అప్పటికే చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.