ప్రాణాలు తీసిన నల్లిబొక్కలు.. గొంతులో ఇరుక్కుని నిజామాబాద్లో ఒకరు..ఆదిలాబాద్లో ఒకరు మృతి

ప్రాణాలు తీసిన నల్లిబొక్కలు.. గొంతులో ఇరుక్కుని నిజామాబాద్లో ఒకరు..ఆదిలాబాద్లో ఒకరు మృతి

ఈ రోజుల్లో ఏ చిన్న పండుగొచ్చినా పబ్బం వచ్చినా.. సండే వచ్చినా .. ఇంటికి బంధువులొచ్చినా నాన్ వెజ్ అనేది కామన్ అయిపోయింది. వారంతో సంబంధం లేకుండా  ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరిగా తింటున్నారు. కొందరు ప్లేటు నిండా  మటన్‌ ముక్కలు, నల్లి బొక్కలతో   భోజనం చేస్తే గానీ ముద్ద దిగదు. అయితే ఈ నల్లిబొక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.  అవును మటన్ బొక్కలు గొంతులు ఇరుక్కుని తెలంగాణలో రెండు రోజుల్లోనే ఇద్దరు చనిపోయారు. మే 12న నిజామాబాద్ లో ఓ వ్యక్తి చనిపోగా.. ఇవాళ మే13న ఆదిలాబాద్ లో ఒకరు చనిపోవడం బాధాకరం.

మహబూబ్ బాద్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ తండాకు చెందిన జాటోతు లక్ష్మణ్ మే 13న  మరిపెడ మండలంలోని కొత్త తండాలో బంధువుల ఇంట్లో దుర్గమ్మ పండుగకు హాజరయ్యాడు. అన్నం తింటుండగా  గొంతులో మటన్ ఎముక ఇరుక్కుని అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు,కుటుంబ సభ్యులు వెంటనే  మరిపెడ పీహెచ్ సీకి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆస్పత్రి దగ్గర కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు.

మే 12న నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తండాలో తారా సింగ్ అనే వ్యక్తి క్ష శుభకార్యానికి హాజరయ్యాడు. అన్నం తింటుండగా గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో వాంతులు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోగా తారాసింగ్ మార్గం మధ్యలోనే చనిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.