మొగుళ్లపల్లి/వేములవాడ రూరల్, వెలుగు: వడదెబ్బ తగిలి మంగళవారం ఇద్దరు చనిపోయారు. వీరిలో ఓ వ్యవసాయ కూలీ ఉన్నాడు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రవి గౌడ్ (55) వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజుమాదిరిగానే మంగళవారం సైతం పనికి వెళ్లిన రవిగౌడ్ ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కూలీలు హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా చనిపోయాడు.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలో వడదెబ్బతో జంకే మల్లేశం (42) చనిపోయాడు. గ్రామానికి చెందిన మల్లేశం వడ్ల కొనుగోలు కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన మల్లేశంను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
