వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు : గీసుగొండ సీఐ విశ్వేశ్వర్

వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు : గీసుగొండ సీఐ విశ్వేశ్వర్

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్​ తెలిపారు. శనివారం పీఎస్​లో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్సై అనిల్ సిబ్బందితో కోనాయమాకుల ఎస్ఆర్ఎస్పీ కెనాల్​ సమీపంలో వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా, కరీంనగర్​కు చెందిన సూర రవి, మహబూబాబాద్ కు చెందిన ఎండీ ఇమ్రాన్​ బైక్​పై అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. 

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇటీవల రాంపూర్, ఎలుకుర్తి, శాయంపేట, గొర్రెకుంట పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావులు, కెనాల్ వద్ద ఉన్న మోటర్లు, ఇనుప సామగ్రి, ఒట టూవీలర్ సుమారు రూ.35వేల విలువ గల వస్తువులను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. గతంలో సూర రవి పై కరీంనగర్, కేశవపట్నం, బోయినపల్లి, మానకొండూరు, మిల్స్ కాలనీ, ఇంతేజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్ పీఎస్​ల పరిధిలో 24 చోరీ కేసులు నమోదుకాగా, ఎండీ ఇమ్రాన్ పై వరంగల్ మిల్స్ కాలనీ, నర్సంపేట, ఖానాపూర్, మహబూబాబాద్, కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, గీసుగొండ పీఎస్​ల పరిధిలో 9 చోరీ కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు కొనసాగుతున్నాయని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వివరించారు.