బ్యాక్స్ లాగ్స్ బాధ: ఇద్దరు స్టూడెంట్లు సూసైడ్...మంచిర్యాల జిల్లాలో ఒకరు..సిద్దిపేటలో మరొకరు...

బ్యాక్స్ లాగ్స్ బాధ: ఇద్దరు స్టూడెంట్లు సూసైడ్...మంచిర్యాల జిల్లాలో ఒకరు..సిద్దిపేటలో మరొకరు...

నస్పూర్, వెలుగు : బ్యాక్స్ లాగ్స్ ఉన్నాయన్న బాధతో బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఫ్లడ్ కాలనీకి చెందిన తాటికొండ సత్యనారాయణ, శ్రావణి దంపతుల కుమారుడు వేదమూర్తి (22) హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. 

సెకండ్ ఇయర్ నుంచి బ్యాక్ లాగ్స్ ఉండడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం తల్లి శ్రావణి స్కూల్ కు, తండ్రి సత్యనారాయణ బంధువుల పెండ్లికి వెళ్లారు. తల్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి వేదమూర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. తల్లి శ్రావణి ఫిర్యాదుతో కేసు నమదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.


సిద్దిపేట జిల్లాలో...


సిద్దిపేట రూరల్, వెలుగు : ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాయన్న బాధతో  స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల గ్రామంలో ఆదివారం జరిగింది. త్రీ టౌన్ ఎస్సై చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల గ్రామానికి చెందిన నల్లమూతి వైష్ణవి (18) ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది.

 ఇటీవల వెలువడిన ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం ఉదయం తన గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. మృతురాలి తల్లి నిఖిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.