యాదాద్రి వెలుగు: గత కొన్ని రోజులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన బోధాసు యాదగిరి, కొమిరే శ్రీను ప్రతి రోజు రాత్రి సమయంలో గ్రామ శివారుల్లోని ఆలయాల్లో ఉన్న వస్తువులను దొంగిలిస్తున్నారని చెప్పారు. 5 గుడులలో దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుతుండగా, సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
