
నాలుగు జుట్లు ఒక చోట ఉండగలవు...కానీ రెండు కొప్పులు మాత్రం ఒక్క చోట కలిసుండలేవు అంటారు.. మన పెద్దలు. ఈ మాటను నిజం చేస్తూ..ఇద్దరు ఆడవాళ్లు కసితీరా కొట్టుకున్నారు. సిగపట్లు పట్టుకుని శివంగుల్లా రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని ఇద్దరు మహిళలు విచ్చలవిడిగా కొట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
15 సెకన్ల ఓ వీడియోలో ఆర్టీసీ బస్సులో ఇద్దర మహిళలు కొట్టుకున్నారు. ఒకరి సిగ మరొకరు పట్టుకుని లాక్కున్నారు. సీటు నాదంటే నాది అంటూ బండ బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
ఢిల్లీలో ఆర్టీసీ బస్సులో ఓ సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఓ వ్యక్తి తన స్టాప్ రావడంతో సీటులో నుంచి దిగిపోయాడు. అయితే అప్పటికే ఆ సీటు దగ్గర నిల్చున్న ఇద్దరు మహిళలు..సీటు ఖాళీ కావడంతో ఒక్కసారిగా కూర్చున్నారు. ఇద్దరు ఒకేసారి కూర్చోవడంతో మహిళల మధ్య వివాదం చెలరేగింది. సీటు నాదంటే నాది అంటూ కొట్టుకున్నారు. జుట్లు పట్టుకున్నారు. ఇంతలో డ్రైవర్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వినలేదు. మరింతగా రెచ్చిపోయి కొట్టుకున్నారు.
Kalesh b/w Two Woman inside Delhi Government Bus over Seat issues pic.twitter.com/M1CWkaU5Xx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2023
మహిళలు కొట్టుకుంటుండగా..వెనక నుంచి ఓవ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు లక్షన్నర మంది చూడగా..వందల సంఖ్యలో కామెంట్స్ చేశారు.